నేటి సాక్షి ,నారాయణపేట, జనవరి 5, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రా కొండ గ్రామంలో గల ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాన్ని రాకుండా గ్రామ సర్పంచ్ పుల్లయ్య సోమవారం నాడు పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుల్లయ్య మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం శిథిల వ్యవస్థలో చేరుకున్నదని, బీటులు వారిందని ఆయన వివరించారు. అంగన్వాడి కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రాకుండా గ్రామంలో స్థలం అంగన్వాడి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో స్థలంను చూపిస్తామని ఆయన వివరించారు. పేట జిల్లా అధికారులు స్పందించి రాకుండ గ్రామానికి అంగన్వాడి నూతన భవనాన్ని మంజూరు చేయాలని ఆయన కోరారు.

