Monday, January 19, 2026

*అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలి**జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాలి**ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారిలో అలసత్వం వద్దు**ప్రజావాణిలో కలెక్టర్ కు ఓసి జేఏసీ నాయకుల వినతి*————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……..,………………………..అగ్ర వర్ణాలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ ఓసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఓ.సి.జెఏసీ నాయకులు ఓ.సి వర్గాలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.ఈనెల 11 న వరంగల్ లో నిర్వహించనున్న ఓసి ల సింహ గర్జన సభను విజయవంతం చేయాలనీ కోరుతూ జగిత్యాల వైశ్య భవన్ లో ఓసి నాయకుల సన్నాహాక సమావేశం నిర్వహించి అనంతరం నాయకులు కలెక్టరెట్ కు వెళ్లి వినతిపత్రం అందజేశారు.*ఈ సందర్బంగా ఓసి జేఏసీ నాయకులు ఎన్నం కిషన్ రెడ్డి, అయిల్నేని సాగర్ రావు, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేందర్ శర్మలు మాట్లాడుతూ*రాష్ట్ర ,జాతీయ స్థాయిలో ఓ.సి కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.ఓ.సి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలనీ వారు డిమాండ్ చేశారు.ఓ.సి వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జనరల్ స్థానాల్లో ఓసి అభ్యర్థులే పోటీచేసేలా రాజ్యాంగ సవరణ చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఓసిల్లోని ప్రతి విద్యార్థికి విద్య, ఉద్యోగాల్లో సహాయం పడేలా ఉండాలన్నారు.ఓ.సి వర్గాలకు చెందిన 10 శాతం ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ఈ డబ్ల్యూ ఎస్ సర్టీఫికెట్ల జారిలో జగిత్యాల జిల్లాలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, నిబంధనల మేరకు వెంటనే జారీ చేయాలనీ కలెక్టర్ ను కోరారు.సమావేశంలో నాయకులు దేవరాశెట్టి జనార్దన్,మోతే ఉమాపతి శర్మ, ప్రసాద్ రావు, బండ పెల్లి చంద్రశేఖర్, రేణికుంట శ్రీనివాస్, అక్కెనపల్లి కాశినాథం, అయిల్నేని స్వప్న, వెంకటేశ్వర్ రావు, సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News