నేటి సాక్షి, తిమ్మాపూర్:తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో సోమవారం పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని, పంచాయతీ కార్యాలయ ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం న్యాయ నిర్ణేతలు అందంగా వేసిన ముగ్గుల్లో మొదటి ఐదింటికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత అలుగునూర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్, సర్పంచ్ గుజ్జుల శ్వేతా ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పొలం మల్లేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

