*నేటి సాక్షి- మేడిపెల్లి* జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా జిల్లాలోని 20 మండలాలకు సంబంధించిన కృషి సఖిలకు ధ్రువీకరణ పత్రాలను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, అందజేశారు. శిక్షణ పొందిన కృషిసఖీలు తమ తమ మండలాలలోని ప్రకృతి వ్యవసాయ మహిళా రైతులకు సహాయపడవలసి ఉంటుందని చెప్పారు. వ్యవసాయంలో ముఖ్యపాత్ర వహించే మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో ప్రావీణ్యత పొందడంతో ఇబ్బంది లేకుండా ఈ పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చునని అందువలన మహిళా రైతులకు ముందువరుషలో ఉంచి ఈ విధానంలో శిక్షణ ఇచ్చామని మండల వ్యవసాయ అధికారి ఎండి షాహిద్ అలీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్, తెలిపారు. ఈ కార్యక్రమంలో జన వికాస ఎన్జీవో ఇతర ప్రకృతి వ్యవసాయ వక్తలు పాల్గొన్నారు.

