వెనిజులాపై అమెరికా దురాక్రమణను ఆపండి.సిపిఎం నాయకులు డిమాండ్.వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో నిరసనసీఐటీయూ జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ మహిపాల్ రైతు ఉపాధ్యక్షులు మాట్లాడుతూవెనిజులాలోని వివిధ ప్రదేశాలపై అమెరికా బాంబు దాడి చేయడం ద్వారా చేపట్టిన దురాక్రమణ చర్యను సీఐటీయూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.వెనేజులా అధికార మార్పు తీసుకురావటానికి, మధురో ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి గత కొన్ని వారాలుగా అమెరికా వెనిజులా చుట్టూ తన సైనిక నావికా దళాలను సమీకరించింది. డిసెంబర్ 2025 మొదటి వారంలో ప్రకటించిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహం 2025 యొక్క నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. పశ్చిమార్ధగోళంలో అమెరికా దళాల కేంద్రీకరణ మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని ట్రంప్ ప్రకటించడం పొరుగుదేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే. 2017, 2018 లో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం మనం చూసాము. ముఖ్యంగా వెనెజులా, నికరాగువ, క్యూబాలకు వ్యతిరేకంగా ఈ రకంగా దాడులకు ప్రయత్నిస్తోంది..అమెరికా దురాక్రమణను వెంటనే ముగించాలని, కరేబియన్ సముద్రం నుండి తన దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. లాటిన్ అమెరికాను శాంతి ప్రాంతంగా ప్రకటించాలి. సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదు.అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. వెనిజులాపై తన దురాక్రమణను వెంటనే ఆపడానికి అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది.భారత ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తూ వెంటనే ప్రకటన చెయ్యాలని కూడా సీఐటీయూ వికారాబాద్ జిల్లా కమిటీఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ విజయలక్ష్మి కవిత కవిత అనురాధ నిర్మల లక్ష్మీబాయి రవి శంకర్ రాజు రాములు తదితరులు పాల్గొన్నారు.

