నేటి సాక్షి,నల్లబెల్లి, జనవరి 5 : ప్రతి గ్రామపంచాయతీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నల్లబెల్లి బీజేపీ మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సూపర్‌డెంట్ ఆబిద్ అలీకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారానే ప్రధానంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను ఎలా పెడుతున్నారో, అదే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కూడా ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయాలని కోరారు.లేనిపక్షంలో మండల పార్టీ ఆధ్వర్యంలో తామే స్వయంగా ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని మోడీ ఫోటోను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు, వల్లే పర్వతాలు, మండల నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, తిమ్మాపురం శివ, కొండ్లె రమేష్, గుండెబోయిన నవీన్, జన్ను మధు, ఈర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

