గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆరు మేకలు మృతినల్లబెల్లి, జనవరి 5 : గుర్తుతెలియని వాహనం ఢీకొని మేకలు మృతి చెందిన సంఘటన బిల్లా నాయక్ తండా శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్లబెల్లి మండలం బిల్ నాయక్ తండ గ్రామ శివారులో సోమవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.స్థానికుల కథనం మేరకు బిల్లా నాయక్ తండాకు చెందిన మాలోత్ శర్మ అడవిలో మేకలను మేపుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.రాత్రి వేళలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం మేకలను ఢీకొట్టడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి.సంఘటనపై డయల్ 100కు ఫోన్ చేయగా నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు.

