నేటిసాక్షి, కరీంనగర్: డీసీసీ, కరీంనగర్ సిటీ కాంగ్రెస్‌తో పాటు వివిధ నామినేటెడ్ పోస్టుల కోసం మంగళవారం ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవుల్లో న్యాయం చేస్తామని పీసీసీ ప్రతినిధులు నమిండ్ల శ్రీనివాస్, గౌస్‌పాషా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ తెలిపారు. సీనియర్ నాయకుడు గడ్డం విలాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు దరఖాస్తులను సమర్పించారు.

