నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 6,( రిపోర్టర్ ఇమామ్ సాబ్),మరికల్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడ కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల దగ్గర చెత్తాచెదారం ఎక్కువగా ఉండడం వల్ల పాఠశాల ఆవరణంలోనికి పాములు ఎక్కువగా వస్తున్నాయని గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య కి పాఠశాల ఉపాధ్యాయురాలు తెలియజేయడం వల్ల మంగళవారం నాడు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి చెత్తాచెదారాలు చెట్లను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు బెలగుంది వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి.రామకృష్ణారెడ్డి, తిరుమలయ్య, సీమ గోపాల్, గోవర్ధన్, టైసన్ రఘు, సంజీవరెడ్డి, బొంత మొగులయ్య, బాలకృష్ణారెడ్డి, మొగులప్ప, కురుమయ్య, పరుశురాం, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

