నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ పట్టణంలో నూతన ఏ ఐ ఏం ఐ ఏం పార్టీ కమిటీ ఏర్పాటు సందర్భంగావికారాబాద్ AIMIM పార్టీ ఇంచార్జ్ సమద్ బిన్ అబ్దాద్ ఆదేశానుసరం AIMIM వికారాబాద్ పట్టణ కమిటీని AIMIM వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ఏర్పాటు చేసారు.ఈ కమిటీకి జాయింట్ సెక్రటరీలుగా మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ మొహియుద్దీన్, షేక్ జలీల్, మహమ్మద్ నవాజ్ షరీఫ్, షేరు ఖాన్ ఎన్నుకోబడ్డారు. ట్రెజరర్ గా మహమ్మద్ ఇమ్రాన్, కమిటీ సభ్యులుగా మహమ్మద్ జాంగిర్, మహమ్మద్ సిరాజ్, అమీర్ ఖాన్, ఎజాజ్ ఖాన్, మహమ్మద్ ముజామిల్, యూత్ విభాగానికి మహమ్మద్ షేహాభాజ్ ఖాన్, మహమ్మద్ ముజాహిద్ లను ఎన్నుకొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఏఐఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసే సభ్యులను ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలకపాత్ర వహిస్తుందని… పదిమంది కౌన్సిలర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈ కమిటీ కార్యాచరణ ఉంటుందని పట్టణ అధ్యక్షుడు ఉస్మాన్ తెలిపారు. అనంతరం ఆలంపల్లి కొత్తగాడి ఉర్దూ మీడియం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. అలంపల్లి ఉర్దూ మీడియం పాఠశాలలో టాయిలెట్స్, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలపడంతో ఈ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

