నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………,…..,…………………….జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం నాడు రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివరాల్లోకెళ్తే జగిత్యాల ఆర్టీవో రోడ్డు భద్రత నియమాలు పాటించాలని,హెల్మెట్ ధరించడం,జీబ్రా క్రాసింగ్ నియమాలను ఫాలో అవ్వడం,అధిక వేగంతో దూసుకెల్లడం లాంటివి చేయవద్దని తెలిపారు. తదనంతరం విద్యార్థిని విద్యార్థులకు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రమీల, అసిస్టెంట్ వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్ రియాజ్, పోలీస్ అధికారులు పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి,డైరెక్టర్లు తిరుపతిరెడ్డి,రాజ్యలక్ష్మి రెడ్డి,ప్రిన్సిపల్ స్వప్న ఇన్చార్జి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

