నేటిసాక్షి, మిర్యాలగూడ : రైతులు సాగు చేస్తున్న మిరప, మిర్చి పంటల్లో అధిక దిగుబడులు పొందుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారి నసీమా అన్నారు. నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని కల్లెపల్లి గ్రామంలో మంగళవారం రైతులతో కలసి హార్టికల్చర్ అధికారి నసీమా మిర్చి పంట పొలాలలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మిరప పంటలో ప్రధానంగా తామర పురుగు, రైజోక్టోనియా వంటి తెగులు వ్యాపిస్తుందని, కావున యాజమాన్య పద్ధతులు పాటించడం వలన, వాటిని నివారించవచ్చని తెలిపారు. తామర పురుగులను తట్టుకోగలిగే అందుబాటులో ఉన్న పంటల రకాలు సాగు చేయాలని,అంతర కృషి చేయడం చ్వారా మట్టిలోని కోశష్ట దశలను నివారించవచ్చని, మొక్కజొన్న, జొన్న మరియు బొబ్బెరను అంతర పంటగా వేసుకోవాలని సూచించారు. పచికారి పురుగు మందులను పిచికారి చేయకుండా, బదులుగా మొక్క ఆధారిత పురుగుమందులను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి గ్రామ సర్పంచ్ రజితమల్లు నాయక్, మరియు రైతులు ధరావత్ మాలు, సక్రు ఏఈఓ ప్రియాంక, ఫీల్డ్ అసిస్టెంట్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

