నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 6 ,(రిపోర్టర్ ఇమామ్ సబ్),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని గతం నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన సర్పంచ్, గ్రామ వార్డు సభ్యుల ఎన్నికల ఖర్చుల రసీదులతో పాటు పూర్తి వివరాలను ఈ నెల 27 వరకు నివేదికలను అందజేయాలని మరికల్ మండల అధికారి జి .రామ్ గోపాల్ తెలిపారు. మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన గెలిచిన సర్పంచులు, ఓడిన సర్పంచులు, అదేవిధంగా గెలిచిన వార్డు సభ్యులు ఓడిన వార్డు సభ్యులు ఖర్చు చేసినా మసీదులతో పాటు పూర్తి వివరాల నివేదికలను ఈనెల 27 వరకు అందజేయాలన్నారు. లేనియెడల ఖర్చు చేసిన పూర్తి వివరాలను ఇవ్వకపోతే ఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మూడు సంవత్సరాల వరకు కోల్పోతారని ఆయన హెచ్చరించారు. మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన గెలిచిన సర్పంచులు ఓడిన సర్పంచులు, గెలిచిన వార్డు సభ్యులు ఓడిన వార్డు సభ్యులు తప్పనిసరిగా ఖర్చుల వివరాల పూర్తి వివరాలను మరికల్ ఎంపిడిఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన వివరించారు.

