నేటి సాక్షి తొగుట జనవరి 06మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో, కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి స్వామి గౌడ్ రూ.27,000/- విలువైన ముఖ్యమంత్రి సహాయ సీఎంఆర్ ఎఫ్ చెక్కు మంజూరైంది.ఈ సందర్భంగా నేడు స్వామి గౌడ్ ఆ చెక్కును అందజేయడం జరిగింది. అనారోగ్యం / కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు స్వామి గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ స్పందించే ఎంపీ కృషితో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి సహాయం అందుతుండటం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తొగుట మండల ఉపాధ్యక్షులు మూడికే స్వామియాదవ్ , మండల దళిత మోర్ఛ అధ్యక్షులు మాదారం ప్రవీణ్ కాన్గల్ బూత్ అధ్యక్షులు మాధవరెడ్డిగారి సుభాష్ రెడ్డి మరియు మారుపల్లి నాగరాజుగౌడ్ మరియు పార్టీ సీనియర్ నాయకులు ఐలిగొండ చంద్రశేఖర్ గౌడ్ గౌరనీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

