నేటిసాక్షి, కరీంనగర్: గంగాధర మండలం గర్శకుర్తి కాపువాడ ఎంపీపీఎస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులకు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పుస్తకాలను ఉపాధ్యాయుడు కోట శ్యామ్‌కుమార్ మంగళవారం ఉచితంగా అందజేశారు. మార్చి 2026 లో పరీక్ష నిర్వహించనుండగా, విద్యార్థుల సాధన కోసం పుస్తకాలను పంపిణీ చేశారు. ఉచితంగా పుస్తకాలను అందజేసిన శ్యామ్‌కుమార్‌ను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, తల్లిదండ్రులు అభినందించారు.

