నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్:బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్‌నార్ రమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ గారిని ఆసిఫాబాద్‌లోని ఆయన నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు హాజరై విశ్వప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాజకీయ జీవితంలో చేసిన సేవలను కొనియాడుతూ, సమాజానికి చేసిన కృషిని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలోఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాసాదే చరణ్,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మామిడి కిరణ్,INTU జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్,ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం మండల కార్యదర్శి కమ్మల వెంకన్న,మాజీ ఎంపీటీసీ మేకర్తి కాశన్న,ఎలాగల మహేష్, షబ్బీర్ తదితర నాయకులు పాల్గొన్నారు

