*నేటి సాక్షి-మేడిపెల్లి* ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల ప్రకారం విద్యుత్ శాఖ ఏ.ఈ బి.అశోక్ మన్నెగూడెం వారు భీమారం మండల కేంద్రంలో గ్రామ రైతులు,విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ ప్రజా బాట నిర్వహించారు,ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ భద్రతల గూర్చి, ప్రభుత్వం అందిస్తున్న 200యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహ జ్యోతి పతకం మరియు సోలార్ రూఫ్ టాప్ పతకం గూర్చి వివరించారు..అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న తెలియజేయాలని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు టోల్ ఫ్రీ 1912 సదుపాయాన్ని వాడుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ ఏ.హరిప్రసాద్, అసిస్టెంట్ లైన్ మెన్ సురేష్ , భీమారం సర్పంచ్ చెక్కపెల్లి స్వాతి-సంజీవ్,ఉపసర్పంచ్ పరమేశ్వర్, ప్రజా ప్రతినిధులు చెక్కపల్లి రఘు,పల్లి అర్జున్ రైతులు సురేష్, విశ్వంభర్,రంజిత్ రెడ్డి,శేకర్ రెడ్డి,రాజేష్,వినోద్,గంగారజం,రాజశేఖర్ వినియోగదారులు పాల్గొన్నారు.

