నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్‌లోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారి క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ గారు, వైస్ చైర్మన్ గాజుల రవీందర్ గారు, డైరెక్టర్లు గాజుల జక్కన్న, వైరాగడే మారుతి పటేల్, మోర్లే విశ్వనాథ్ గార్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారిని కూడా సన్మానించారు.అనంతరం శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆసిఫాబాద్ మార్కెట్ సమగ్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

