నేటి సాక్షి తిరుపతి *చిత్తూరు*చిత్తూరు నగరంలో నిర్వహించిన జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై గాంధీ సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని, నగర ప్రజలను చైతన్య పరిచాను. రహదారి భద్రత నియమ నిబంధనలను పాటిస్తూ.., విలువై ప్రాణాలను కాపాడుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రజలకు సూచించారు.

