నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంబులెన్స్ లు ఏర్పాటు చేసిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి, జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డీలు తెలిపారు.బుధవారం హైదరాబాద్ లో నిర్మలరెడ్డి, కిషన్ రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టె రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతఇస్తున్నాధన్నారు.రైతు భరోసా, రైతుల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర కల్పించడం, సన్న వడ్లకు అదనంగా ₹ 500 బోనస్, ఇప్పుడు విధ్యుత్ అంబులెన్సు లు ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు.*1912 కి సమాచారమిస్తే విధ్యుత్ సమస్యలకు తక్షణ పరిష్కారం*వారానికి 3 రోజులు అధికారులు రైతుల కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసేందుకు పొలాల్లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించనున్నారని వారు తెలిపారు.అన్నదాతలకు అదనంగా లోడ్ ఉంటే ట్రాన్స్ ఫార్మరర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం విధ్యుత్ ఇబ్బందులను తొలగింస్తుందని నిర్మలా రెడ్డి, కిషన్ రెడ్డి లు పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందజేయడంలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలని వారు సూచించారు.

