నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 7, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), పాఠశాలప్రధానోపాధ్యాయురాలు భారతి పేట జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు తెలుగు హిందీ ఆంగ్లము అభ్యాస దీపికలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అవసరాలను దృష్టి లో పెట్టుకుని పదవ తరగతి విద్యార్థుల కోసం ఈ అభ్యాస దీపిక తయారు చేయడం జరిగింది ఈ అభ్యాస దీపిక పాఠాలలోని ముఖ్యాంశాలను విద్యార్థులు తేలికగా అర్థం చేసుకునేలా స్వీయ అభ్యాసనానికి అనుకూలంగా రూపొందించబడిందని తరగతిలో బోధనభ్యాసన కార్యక్రమాలు వర్క్ షీట్లు మరియు డిజిటల్ తరగతుల ద్వారా పొందిన జ్ఞానాన్ని మరింత బలపరచడానికి ఈ స్వీయపఠన సామాగ్రి ఉపయోగపడుతుందని ప్రతి పాఠంలోని కవి పరిచయం పాఠ్యంలోని ముఖ్యంశాలు పద్యాలు ప్రతిపదార్థాలు స్వీయ రచన సుజనాత్మకత పదజాలము వ్యాకరణాంశాలు పరిచిత అపరిచిత పద్య గద్యాలు మొదలగు అంశాలను అవగాహన చేసుకోవడంతోపాటు వాటిని అభ్యాసన చేసేందుకు ప్రశ్నలు కూడా ఇవ్వబడ్డాయి వీటి ద్వారావిద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సులభంగా సంసిద్ధులు కావచ్చు ఈ అభ్యాస దీపికలు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకానికి ప్రత్యామ్నాయంగా కాకుండా సహకారిగా వినియోగిస్తూ విద్యార్థులకు తగిన సూచనలు ఇస్తూ దిశనిర్దేశం చేయాలి ఇందులో గల అభ్యాసాలు విద్యార్థులు స్వయంగా చేసేలా ప్రోత్సహించాలి ఈ అభ్యాస దీపిక వల్ల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధు, విజయ,మధుసూదన్, భాను, ప్రకాష్,లక్ష్మణ్,ప్రతాప్, శశిరేఖ, శిరీష,మంగళ,నిర్మల, శ్రీదేవి, రఘురాం రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.

