నేటి సాక్షి, ధర్మారం (జనవరి 07) : వెనుకబడిన తరగతుల బీసీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్ పీ) పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం సంజీవ్ కోరారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ కు ఆయన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ల తరహాలోనే బీసీల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మారం మండల సోషల్ మీడియా కన్వీనర్ ముత్తునూరి అంజి బాబు, భూపల్లి ప్రసాద్, ముత్యాల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

