నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరిగే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఈ నెల జనవరి 31 నుండి ఫిబ్రవరి 1, 2 తేదీల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో, జాతర ఏర్పాట్లపై అన్ని శాఖలతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేష్ దోత్రే గారు, జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్ గారు, ఏఎస్పీ శ్రీ చిత్తరంజన్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు,ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్ గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు పల్లె ప్రకాష్ రావు గారు,ఆలయ కమిటీ చైర్మన్ జయరాం గారు, డైరెక్టర్లు,మాజీ సర్పంచ్ కొవ్వూరి శ్రీనివాస్ గారు,సోనాలే సంతోష్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు

