నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ రాబోయే గంగపూర్ జాతరను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించేందుకు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు గంగపూర్ ఆలయాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ పరిసరాల్లో తీసుకోవాల్సిన పోలీస్ బందోబస్తు, రద్దీ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.జాతర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ గారు ఆదేశించారు.ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

