నేటిసాక్షి : జగదేవపూర్ జనవరి 07పాఠశాలలో గ్రంధాలయం పిల్లలకు వరమని ఏంఈఓ సైదులు, సర్పంచ్ రజిత పరశురామ్ అన్నారు. బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గ్రంధాలయం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుకున్న పిల్లలతోనే ప్రపంచ మార్పు మొదలవుతుందని, చదవడం అలవాటు చేసేవే కథల పుస్తకాలు అని అన్నారు. పుస్తకం చేతిలో ఉంటే ప్రపంచమే మన చెంత ఉన్నట్లు అని పుస్తకం మంచి మిత్రుడు అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపికళ మాట్లాడుతూ రూమ్ టూ రీడ్ వారు మా పాఠశాలలో గ్రంధాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని, సుమారు ఆరు వందల పుస్తకాలు మరియు కూర్చొని చదువుకోవడానికి కావాల్సిన బల్లలు కార్పెట్స్ ఇచ్చి, గదిని చిత్రాలతో పెయింటింగ్ వేసి గ్రంధాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒకటో తరగతి పిల్లల తల్లిదండ్రులకు రోజూ వారి దినచర్య కాలండర్స్ ఇచ్చి పిల్లల్ని రోజూ ఇంటివద్ద ఎలా చదివించాలో రూమ్ టు రీడ్ కో ఆర్డినేటర్ భవానీ వివరించారు. అలాగే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను వండుకొని పాఠశాలకు తీసుకువచ్చారు. విద్యార్థులు తీసుకవచ్చిన ఆహార పదార్థాలను ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించి తిని రుచిచూసారు. కల్తీ లేని ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ఎంఈఓ సైదులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పిఏసీఎస్ మాజీ డైరెక్టర్ భూమయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు సత్తయ్య, భాస్కర్, నాగరాజు, తరుణశ్రీ, నవిత, బాల్ రెడ్డి, అమృతమ్మ, వార్డు సభ్యులు మల్లేశం, నీరజ, అశ్విని, వివిధ పార్టీల నాయకులు కర్ణాకర్, భూమయ్య, ఎల్లారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, యాదగిరి, నాగరాజు, దయానంద్ రెడ్డి, ఆంజనేయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

