Monday, January 19, 2026

జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారుల సమీక్ష సమావేశం.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి.

నేటి సాక్షి వికారాబాద్:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి బుధవారం జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షిక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లా పరిధిలో జరిగే ప్రసవాలు వీలైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు నిర్వహించాలని, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తప్పనిసరిగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రసవాలు నిర్వహించాలని , సిజేరియన్ ప్రసవాలను ప్రోత్సహించరాదని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జరిగే విధంగా చూడాలని , సిజేరియన్ ప్రసవాలకు గల కారణాలను సిజేరియన్ నిర్వహించిన ఆసు పత్రులలో ఆడిట్ నిర్వహించాలని పుట్టిన ప్రతి బిడ్డకు కచ్చితంగా వాక్సినేషన్ చేయాలని జిల్లాలో టీకా కరణ కార్యక్రమం 100% ఉండే విధంగా ప్రతి పీహెచ్ సి వైద్యాధికారి జాగ్రత్త వహించాలని, అందించిన అన్ని రకాల సేవలను ఏచ్ ఏం ఐ ఎస్ పోర్టల్,ఏం సి ఏచ్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వికారాబాద్ జి జి హెచ్ లో ఉన్న క్యాన్సర్ కేర్ సెంటర్ కు జిల్లా పరిధిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు క్రమానుగతంగా సేవలు పొందే విధంగా జాగ్రత్తలు వహించాలని ప్రతి పీహెచ్సీ వైద్యాధికారి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అవుట్ పేషెంట్ సేవలను కొనసాగించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేకరించిన రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని టీ హబ్ కు పంపించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి చికిత్స అందించి ప్రతి నెల 15వ తేదీ లోపు వారి పోషకాహార లోపం ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పవిత్ర, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ పద్మ, డిప్యూటీ డి ఏం &ఏచ్ ఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రవీణ్ , డిప్యూటీ డెమో శ్రీనివాసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పర్యవేక్షిక సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News