నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మండల పరిధిలోని జైదు పల్లి గ్రామంలో మహాసభల పోస్టర్ కరపత్రం విడుదల చెయ్యడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి అనసూయ మాట్లాడుతూ …2026 జనవరి26 నుండి 28 వరకు ప్రతినిధుల మహాసభ26 రాష్ట్రాల నుండి ప్రతినిధుల రాక…ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి వెల్లడి.అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )14వ జాతీయ మహాసభల సందర్భంగా2026 జనవరి 25న హైదరాబాద్ లో ని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభకు మహిళ లోకం తరలిరావాలి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని, 2026 జనవరి 25న హైదరాబాద్ మహానగరంలో ని ఎన్టీఆర్ గార్డెన్స్ లో లక్షలాదిమందితో బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభ విజయవంతానికి మహిళలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల పాటు హైదరాబాదులో జరిగే ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు. జాతీయ సంఘమైన ఐద్వా మహిళల హక్కులు, విద్య, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపిసి 498 ఏ సెక్షన్, కేంద్ర,రాష్ట్ర మహిళా కమిషన్, గృహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు వంటి అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా ఐద్వా అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడానికి వ్యతిరేకిస్తూ పోరాడి దానిని నిలవరించడంతోపాటు, లక్షల సంఖ్యలో ఉన్న ఇంటి పని వారిని సంఘటిత పరిచి స్నేహ ఇంటివారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిందన్నారు. కనీస వేతన చట్టం, పని హక్కు, ఆహార భద్రత, మద్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రతిష్ట తదితర అంశాలపై వేలాదిమంది మహిళలను పోరాడి అనేక హక్కులు సాధించిందన్నారు. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింస, అభద్రత, నిరుద్యోగం, తగ్గుతున్న శ్రీ పురుష నిష్పత్తి, విద్య, వైద్యం, నిత్యవసర ధరలు వంటి సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై, యువతులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయి అన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన, జమ్మూ కాశ్మీర్ లో కతువా ఘటన, మణిపూర్లో రావణ కాస్తంలో జరుగుతున్న హింస బిజెపి పరిపాలనకు నిదర్శనంగా ఉందన్నారు.దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు రాక 2026, జనవరి 25 నుండి 28 వరకు జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )14వ జాతీయ మహాసభలు ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన 1000 మంది మహిళా ఉద్యమప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ మహాసభల కు ముఖ్యఅతిథిగా ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకరత్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీమతి టీచర్, మరియం దావలె, ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి, సుధా సుందర రామన్ తో పాటు అనేకమంది కాకలు తీరిన మహిళ ఉద్యమ నాయకురాలు హాజరవుతున్నారని అన్నారు. చారిత్రాత్మకమైన తెలంగాణ రాష్ట్రంలో ని హైదరాబాదులో జరుగుతున్న ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా మహాసభల విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా సెమినార్ లు, సదస్సులు, చర్చ గోస్టులు, ఫోటో ఎగ్జిబిషన్, కళాజాతాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభల విజయవంతానికి ప్రజలంతా హార్దికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం, మనువాదాన్ని తిప్పి కొడదాం, మహిళల హక్కుల కోసం ముందుకు సాగుతాం అనే నినాదంతో మహాసభలు జరుగుతున్నాయి అన్నారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఐద్వా మహిళా సంసంఘం నాయకులు రాలు గుడ్లల లక్ష్మీ అనసూయ మాల మంజుల అనసూయ , లక్ష్మమ్మ ఎం సుక్కమా పిట్టల పద్మమ్మ సి లక్ష్మమ్మ ఉపాధ్యక్షులు ఆర్ మహ తదితరులు పాల్గొన్నారు.

