*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ ప్రాజెక్టు డిడబ్ల్యూఓ నరేష్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఇటీవల కోరుట్ల పట్టణంలోని ఖాజీపుర-3 సెంటర్ నిర్వాహకురాలు సంగీత నిర్వాకం పై వచ్చిన కథనం దృష్ట్యా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ కావడంతో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు మిగితా సెంటర్ల పరిస్థితి ఏంటని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఐబి రోడ్ -2 సెంటర్,జవహర్ రోడ్-1 సెంటర్ లను డిడబ్ల్యూఓ నరేష్, మెట్ పల్లి సిడిపిఓ మణి లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఇందులో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అందించాల్సిన పౌష్టికాహారం, గుడ్లు,పాలు అందిస్తున్నారా.? లేదా.? అని అడిగి తెలుసుకున్నారు. సరుకులు ఉన్నాయా.? లెక్కల్లో తేడాలున్నాయా.? రిజిస్టర్ ల మెయింటెనెన్స్ ఎలా ఉందని ఆయన ఆరాతీశారు. సెంటర్ టీచర్లు,ఆయాలు సమయపాలన పాటిస్తున్నారా.? పిల్లలు వస్తున్నారా.? గర్భిణీ స్త్రీలకు సీమంతం, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.ఇకపై ప్రాజెక్టు నియమ నిబంధనలకు అనుగుణంగా ఎవరూ విధులు నిర్వహించకున్నా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఆయన వెంట సిడిపిఓ మణి, సూపర్ వైజర్ అనిత, సెంటర్ టీచర్లు, ఆయాలు ఉన్నారు.______

