Monday, January 19, 2026

*కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి* – *సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం*

నేటి సాక్షి, ధర్మారం (జనవరి 08): కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం కోరారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో ధర్మారం మండల కేంద్రంలోని గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం ను కలిసి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించేందుకు కృషి చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఆయన వెంటనే స్పందిస్తూ ఆర్బిఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి కి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ విషయం పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీ మెయిల్ ద్వారా, రిజిస్టర్ పోస్టు ద్వారా మనకు పంపించడం జరిగిందని అన్నారు. అంతరం ఎస్సీ కమిషన్ సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక వ్యవహరాల శాఖ పరిశీలన చేసి ఇది న్యాయమైన కోరిక అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దీనిని కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అమలు చేయాల్సిందేనని కోరారు. కానీ ఇంతవరకు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించడం లేదని మార్చి 5న ఢిల్లీ పై దండోరా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని అమలు చేసే విధంగా మాట్లాడి సపోర్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, ఎర్రగుంటపల్లి సర్పంచ్ దూడ ప్రియాంక తిరుపతి, కొత్తూరు మాజీ సర్పంచ్ మద్దెల నరసయ్య, నాయకులు సుంచు మల్లేశం, నేరువట్ల మహేందర్, నేరువట్ల రవి, బొల్లి నందయ్య, పుల్లకొల్ల లింగమూర్తి, ఇరుగురాల రాజనర్సయ్య, బొల్లి రాజం, సంఘోమ్ రాజ్ కుమార్, తీగుట్ల ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News