పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలికరీంనగర్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు.

