నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్:బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి గౌరవ శ్రీ అజ్మీరా శ్యామ్ నాయక్ గారికి ఆసిఫాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానం చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని శ్యామ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ, ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు.దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా పనిచేస్తే సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని శ్యామ్ అన్న పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, బీసీ సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

