నేటి సాక్షి 08 జనవరి పాములపాడు:- రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల పాలకులు నిర్లక్ష్యంతో అన్యాయం చేయాలని చుస్తే ప్రతిఘటన తప్పదని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్టు తమ ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు ఆపారని సాక్షాత్తు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని సమాదానం చెప్పాలని రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టడమే వీరి లక్ష్యం ఉన్నట్టుందని కుమ్మక్కు రాజకీయాలు రాయలసీమ ప్రజలకు అర్థమవుతున్నాయని తక్షణమే నిధులు విడుదల చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని లేని పక్షంలో సిపిఐ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య హెచ్చరించారు.. గురువారం సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టులు పరిశీలన చేశారు.. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. రామాంజనేయులు రాష్ట్ర రైతు సంఘం గౌరవాధ్యక్షులు పి. రామచంద్రయ్య కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం లు పాల్గొని మాట్లాడారు.. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి ఎన్నో దశాబ్దాల కాలంగా సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతుందని కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు జరగడం లేదన్నారు. ఏడాదిలో 30 రోజులు వచ్చే వరద జలాలు కూడా రాయలసీమ ప్రాంతం వాడుకోవడానికి హక్కు లేదా అని 40 సంవత్సరాల నుండి రాయలసీమలో ఆకలి కేకలు వినపడుతున్నాయని రైతులు పంటలు పండక వ్యవసాయ కూలీలుగా మారి అనేక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి అన్నారు.. కేసీ కెనాల్ ఎస్ ఆర్ బి సి తోపాటు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో నీటి పంపకాల విషయంలో కాస్త ముందడుగు వేసిన నేటికీ నత్తనడకన సాగుతున్నాయి అన్నారు. రాయలసీమలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులైన తెలుగుగంగ ఎస్ఆర్బిసి గాలేరు నగరి వెలుగొండ గోరుకల్లు తదితర లకు పోతిరెడ్డిపాడు నీరే ఆధారం అలాంటి విధానానికి వ్యతిరేకంగా పాలకులు విళంబిస్తున్నారని వారు విమర్శించారు.. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు గుండెకాయ అని వారన్నారు.. రాజకీయ క్రీడలో నీటిని వాడుకుంటే రాయలసీమ ద్రోహులుగా మిగులుతారని చంద్రబాబును హెచ్చరించారు. అమరావతి పోలవరం తప్ప రాయలసీమ రైతు బాధలు కానీ ప్రజలు బాధలు కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు.. వేల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో వృధా చేస్తున్నారు తప్ప రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచన విధానం లేని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు ఇదే పరిపాలన కొనసాగిస్తే రాయలసీమ ప్రజాగ్రహం చూడాల్సిన పరిస్థితి వస్తుందని కలిసి అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తామని వారికి హెచ్చరించారు.. కార్యక్రమంలో కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునియప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రఘురామమూర్తి, రమేష్ బాబు,మోటరాముడు,నాగరాముడు సమితి సభ్యులు ప్రతాపు వెంకటశివుడు మజీద్ మురళీధర్, ధనుజయ, స్థానిక మండల నాయకులు మక్బూల్ బాషా సలీం బాషా,నరసింహ, శీను రమణ తదితరులు పాల్గొన్నారు..

