నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొడవెల్లి కాంట కాలనీ, పైకాజీ నగర్ కాలనీల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు పర్యటించి, సైడ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ శ్రీమతి ఇరుకుల మంగ గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గాజుల రవీందర్ గారు, ఆత్మ చైర్మన్ గడ్డల సత్యనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి నిజాం గారు, మోదం సుదర్శన్ గౌడ్ గారు, ఏఎంసీ డైరెక్టర్లు గాజుల జక్కన్న గారు, విశ్వనాథ్, మోర్లే మారుతి పటేల్, వెంకటేష్, అజ్మీరా అబ్బు, వెంకటేష్ సాయి తదితరులు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

