ఫలించిన Dr-Visharadan Maharaj గారి ధర్నా… విద్యార్థులకు రక్షిత మంచి నీటి సదుపాయానికి మండల పరిషత్ పాలకుల హామీ… తక్షణ సదుపాయాల ఏర్పాటుకు తరలి వచ్చిన యంత్రాంగం ఒక లక్ష కిలో మీటర్ల MaaBhoomiRathaYatra లో భాగంగా జగిత్యాల జిల్లా లో జరుగుతున్న యాత్ర లో భాగంగా నేడు బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించడం జరిగింది. పాఠశాల లో విద్యార్థులకు కనీస తాగు నీటి సరఫరా లేని పరిస్థితి చూసి బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ చైర్మన్ Dr విశారాధన్ మహారాజ్ గారు ధర్నా కు దిగడం తో స్థానిక మండల ఎంఇఓ, ఎంపిడిఓ, ఎంపీఓ సెక్రెటరీ, ఎస్ఐ తదితర యంత్రాంగం హుటాహుటిన వచ్చి, పైప్ లైన్ సరిచేయడానికి జేసీబీ ని తెప్పించి తక్షణ చర్యలు చేపట్టారు. అదే విధంగా విద్యార్థులకు ప్రతీ రోజు మినరల్_వాటర్ సదుపాయం చేస్తామని MPDO గారు హామీ ఇచ్చారు. స్థానిక MLA గారు సైతం ఫోన్ ద్వారా విశారదన్ గారి తో సంప్రదించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగింది.

