Sunday, January 18, 2026

జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచాలి పల్లెగడ్డ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు…. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం…. మొదటి బహుమతి రూ, 80000…. రెండో బహుమతి రూ, 40000….. నారాయణపేట జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి…..

నేటి సాక్షి, జనవరి 8,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), జాతీయస్థాయి క్రీడల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని నారాయణపేట జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పల్లెగడ్డ గ్రామం వద్ద నిర్వహించిన పల్లెగడ్డ ప్రీమియర్ లిగ్ క్రికెట్ పోటీలను సూర్యచంద్ర ఫౌండేషన్ చైర్మన్ ఎస్ సూర్య మోహన్ రెడ్డి, మరికల్ ప్రతిభ పాఠశాల చైర్మన్ హనుమంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో గత నెల కిందట ప్రారంభించడం జరిగింది. దాదాపు 8 టీములు పాల్గొనడం జరిగింది. ఫైనల్ కు లక్ష్మణ్ లెవెన్ టీం,నారి ఫ్లోరోసిoగ్ టీoలు తలబడ్డాయి….. ఈ పోటీలో లక్ష్మణ్ లేవన్ టీం విజయం సాధించింది. ఇట్టి బహుమతులను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి, పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో క్రికెట్ టీం విజయం సాధించిన లక్ష్మణ్ టీం కు నగదు రూ,80000 చెక్కును పంపిణీ చేయడం జరిగింది. రెండో టీం కు నగదు రూ,40 వేల రూపాయలు బహుమతులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలలో రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న, మరికల్ గ్రామ సర్పంచ్ గుప చెన్నయ్య, మరికల్ ఎస్సై రాములు, ఆంజనేయులు శ్రీకాంత్ రెడ్డి, టైసన్ రాఘవేంద్ర, గోవర్ధన్, రామకృష్ణ పి రఘు, ఎల్ రాములు, నాగరాజు, బొంత మొగులయ్య,, అంజి విష్ణు,వీర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News