నేటిసాక్షి, కరీంనగర్: సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కోట శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గర్శకుర్తి పాఠశాలల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మోలంకుల శ్రీనివాస్, శశికాంత్ రెడ్డి, ఉమ, వెంకటరమణ, వేణు కుమార్, షబీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

