నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని వర్డ్ డీడ్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ యం.డి.కలీమ్ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల రంగవల్లికలను, రకరకాల రంగులతో అందంగా అలంకరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ఆవరణలో సందడిని నెలకొల్పారు. భోగిమంటలు, గంగిరెద్దుల ఆటపాటలు, గొబ్బెమ్మలు,పతంగులు ఎగుర వేసి విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ యం.డి.కలీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన రంగవల్లికలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు సుమలత, అన్నపూర్ణ, శిల్ప, నాజియా, షబానా, కరుణ, ఫర్జానా, నస్రీన్, రిజ్వానా, ఆసియా, నిఖిత, హబీబా, రాజశేఖర్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

