*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం లో యువకుడు గంజాయితో వెళుతున్నాడని సమాచారం అందగానే ధర్మపురి శివారులో గల కమలాపూర్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించి అటుగా వెళుతున్న యువకుడిని అందుబాటులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 129 గ్రాముల గంజాయి దొరికినది. అతడి వివరాలు తెలుసుకోగా అతడు ధర్మారం మండలానికి చెందిన కూతాడి దుర్గాప్రసాద్ అని తెలిపినాడు. అతడిని విచారించగా అతడు మంచిర్యాలకు చెందిన కండ్రకొండ వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకున్నానని తెలుపగా ధర్మపురి పోలీసు వారు సదరు కండ్రకొండ వెంకటేష్ అన్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తను మహారాష్ట్రలోని గుర్తుతెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తానని తెలిపినాడు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అని ఎస్ ఐ జి మహేష్ తెలిపారు ధర్మపురి మండలం లో గంజాయి తాగిన అమ్మిన కలిగి ఉన్మ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం గంజాయి గురించి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఎస్ ఐ జి మహేష్ తెలిపారు

