నేటి సాక్షి 09 జనవరి పాములపాడు:- పాములపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, ఎస్సై పి.తిరుపాలు, తదితర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్యకు నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు వినతి పత్రం సమర్పించి విన్నవిస్తూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలోని సర్వే నంబరు-504లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమినీ గ్రామంలోని ఎస్సీలు దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నా, అధికారులు ఇంతవరకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చెయ్యలేదని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేక సాగు చేసుకుంటున్న ఎస్సీ రైతులు సబ్సిడీ విత్తనాలు, క్రాప్ లోన్లు రైతు భరోసా లాంటి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందడం లేదని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం రీసర్వే పేరుమీద రాష్ట్రవ్యాప్తంగా భూములను కొలతలు వేస్తున్నదని, మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలైనా ఇంతవరకు సర్వే నంబర్ 504 గురించి రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయంపై తొందరగా నిర్ణయం తీసుకుని సాగు చేసుకుంటున్న ఎస్సీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా మండలంలోని నాయకులు, ప్రజలు ఇచ్చిన సమస్యల అర్జీలకు అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషణ్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకులు జి.హరి ప్రసాద్ యాదవ్, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి నాయకులు బోనపల్లె వినయ్ కుమార్, ఆదిరెడ్డి, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఐకెపి ఎపిఎం-ఉమామహేశ్వరి, వీఆర్వో శివన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

