*నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )రుద్రంగి పోలీస్ స్టేషన్ కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. మోతీరామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై బి. శ్రీనివాస్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో మోతీరామ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇక్కడ పనిచేసిన బి. శ్రీనివాస్ బదిలీపై వేములవాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మోతీరామ్‌కు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

