నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జనవరి 9మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీబిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు,సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్. లండూరి శ్యామ్ రావు.ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడిందిగత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా కార్మికులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేసి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు పట్టణ పరిశుభ్రతకు వెన్నెముకలాంటివారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.కార్మికుల హక్కుల కోసం ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకే ఈ సహాయ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.కార్యక్రమం సందర్భంగా కార్మికులు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గ కన్వీనర్.శ్యామ్ రావు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ మరో సీనియర్ నాయకులు గొల్లెం వెంకటేష్ నక్క మనోహర్.శోభన్ శ్రీనివాస్ , పోచం సల్మాన్.నరేందర్ , షాకీర్.ఆరిఫ్ నాజిమ్.బాబర్ ముస్తఫా.మరియు మహిళా నాయకురాలు నియోజకవర్గ మహిళా కో కన్వీనర్ కమల టౌన్ అధ్యక్షురాలు తాండ్ర వరలక్ష్మి , దమయంతి , మరియు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

