నేటి సాక్షి 09 పాములపాడు:- పాములపాడులోనీ, టిడిపి పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి ఆదేశాల మేరకు పాములపాడు టిడిపి మండల నాయకులతో కలిసి, కార్యకర్తల సమావేశాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి లు మాట్లాడుతూ, నేను మీకు సేవకున్ని, సమస్యలు ఉంటే కలిసికట్టుగా పరిష్కరించుకుందాం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం అన్నారు. ఈరోజు పార్టీలో చాలా మార్పు వచ్చిందనీ, యువకులకు అవకాశం కల్పించాం అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అధినేతలు అనే మాటను శిరసావహిస్తూ, నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నామని, వారి సమస్యలను తెలుసుకుంటున్నాం అన్నారు. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలను కలుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, పాములపాడు మండల కన్వీనర్- జి.రవీంద్రారెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకుడు జి.హరిప్రసాద్ యాదవ్, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, బండ్లమూరి.వెంకటేశ్వర రావు, మద్దూరు సొసైటీ వాడాల జనార్దన్ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ లింగాల.నాగరాజు, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, టిడిపి నాయకులు లాయర్ బతుకులయ్య, వేంపెంట బోనపల్లె వినయ్, ఆదిరెడ్డి, జూటూరు నాయిని మధు, నాయిని కృష్ణ, ఇస్కాల లింగస్వామి, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

