నేటి సాక్షి, ఎండపల్లి:* మండల కేంద్రంలోని జై భీమ్ సేవా సమితి ఎస్సీ కాలనీలో ఆదర్శ సేవలు అందిస్తూ గుర్తింపు పొందుతోంది. కాలనీలో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తూ.. అంత్యక్రియలు, తద్దిన కర్మలు తదితర సంప్రదాయ కార్యక్రమాల నిర్వహణలో సమితి సభ్యులు సహకారం అందిస్తున్నారు. దుఃఖ సమయంలో కుటుంబాలకు మనోధైర్యం, భరోసా కల్పించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సమితి సభ్యులు తెలిపారు. మానవత్వాన్ని చాటుతూ నిర్వహిస్తున్న ఈ సేవలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

