నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో బహుజన సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ) పూర్తి స్థాయిలో బరిలోకి నిలుస్తుందని జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవి శంకర్ తెలిపారు. శనివారం పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు నాలి నాగరాజు ఆధ్వర్యంలోబీఎస్పీ పార్టీ నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా జోనల్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్, జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవి శంకర్, జిల్లా ఈసి మెంబర్ గాలిబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

