నేటి సాక్షి 10 జనవరి పాములపాడు :—ఈరోజు పాములపాడు గ్రామంలో సంక్రాంతి పండుగను సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్లయ్య , డిఎస్పి రామాంజనేయులు నాయక్ ,ఎస్ఐ. పి తిరుపాలు, పాల్గొన్నారు.మొదటి బహుమతి 30,000 స్పాన్సర్లుగా,జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కురువ రమేష్ ,వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ గోపాల్ మమతా క్లినిక్ రాజు పాల్గొన్నారు.రెండో బహుమతి 20,000స్పాన్సర్లుగాఎస్విఎల్ రంజిత్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ *కురువ నాగరాజు,మూడో బహుమతి 10,000స్పాన్సర్లుగా టైలర్ లింగారెడ్డి ,డిష్ రామచంద్ర వ్యవహరించారు.ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆడాలి, క్రికెట్ ఆడి ఎంతో మంది మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. మీరు కూడాఇలా చిన్న చిన్న టోర్నమెంట్ లో క్రికెట్ ఆడుతూ ఉంటే ఏదో ఒకరోజు బాగా ఆడి మన రాష్టానికి దేశానికి మంచి ఉన్నత స్థానం లోకి వెళ్ళాలి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.బ్రాహ్మణకోట్కూరు వర్సెస్ లింగాల* మధ్య జరిగిన ఇనాగ్రేషన్ మ్యాచ్‌కు రిబ్బన్ కట్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో *మాజీ జెడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరరావు, బంగారు వెంకటేశ్వర్లు గుణ శేఖర్ రెడ్డి , పల్లె రఘురాం రెడ్డి ,కురువ వెంకటేశ్వర్లు, చింతల నారాయణ, వీరారెడ్డి, వెంకటస్వామి తిమ్మయ్య, బాలస్వామి, యోహాన్, లోకేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామ సుబ్బయ్య, ఉషేన భాష కొత్తపల్లె మండలం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

