నేటిసాక్షి, మిర్యాలగూడ :త్వరలో ఇంటికో హెల్మెట్ పంపిణి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్ఎస్ పి క్యాంపు గ్రౌండ్ లో “నో హెల్మెట్-నో పెట్రోల్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 500 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనదారులతో కలిసి హెల్మెట్లు ధరించి, పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించడం ద్వారా వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడినవారు అవుతారని అన్నారు.హెల్మెట్లు ధరించడం ద్వారా కాలుష్యం నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, నేటి నుంచి పెట్రోల్ బంక్ లలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా పకట్బందిగా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

