నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బుగ్గారం మండలం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి సంక్రాంతి పండుగ సందర్భంగా దొంగతనాలు నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలుసంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. ఈ సందర్భంగా చాలామంది తమ స్వగ్రామాలకు లేదా ఇతర గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ఇళ్లు ఖాళీగా ఉండటంతో కొంతమంది దొంగలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు.ప్రజల ఆస్తి భద్రత దృష్ట్యా, పండుగకు వెళ్లే ముందు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై జి సతీష్ కోరారు ఇంటి తలుపులు కిటికీలు, వెంటిలేటర్లు అన్నీ బాగా తాళాలు వేసి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంక్ లేదా లాకర్‌లో భద్రపరచాలి.నమ్మకమైన పొరుగువారు లేదా బంధువులకు మీ ప్రయాణ సమాచారం తెలియజేసి, ఇంటిని గమనించమని కోరాలి.రాత్రి సమయంలో ఇంట్లో లైట్లు లేదా వెలుతురు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి.సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఉంటే అవి సక్రమంగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి ఇంటి నుంచి వెళ్లిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయకూడదు ఇంట్లో పనిచేసే పనివాళ్ల వివరాలు సరిగా ధృవీకరించుకొని అవసరమైన సమాచారం మాత్రమే ఇవ్వాలి.ఎక్కువ రోజులు ఇంట్లో లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం మంచిది. వెనుక తలుపులు, టెర్రస్ మార్గాలు వంటి ప్రదేశాలను ప్రత్యేకంగా పరిశీలించి తాళాలు వేయాలి. వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో లేదా అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచాలి.సంక్రాంతి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరం. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై జి. సతీష్ తెలిపారు

