Sunday, January 18, 2026

అన్నమయ్య జిల్లా:చౌడేపల్లి మండలంఘనంగా కే.పి.ఏల్ ప్రారంభం…క్షత్రియ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్..హోరా హోరిగా పోటీలో దిగిన క్రికెట్ జెట్లు.. కే.పి.ఏల్ అంటే యువతకు క్రేజ్…ఇది కదా కే.పి.ఏల్ అంటూ గ్రామస్తులతో నిండిన క్రికెట్ మైదానం..సంక్రాతి వైభవానికి యువత చైతన్యం కె. పి. ఎల్ క్రికెట్ టోర్నమెంట్… అచ్చం స్టేడియం ని తలపిస్తున్న కే.పి.ఏల్ క్రికెట్ మ్యాచ్..కె. పి. ఎల్ క్రికెట్ మ్యాచ్ లో క్షత్రియ కుటుంబ సభ్యుల సందడి…క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11సీజన్ క్రికెట్ టోర్నమెంట్…

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 11సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం రాజులూరు కేపీఏల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు, జతిన్ ఇంఫ్రా కంపెనీ ఎం.డి పురుషోత్తం రాజు ల ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు,భాస్కర్ రాజు,లక్ష్మణ్ రాజు, వెంకటరమణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు,శంకర్ రాజు,మేకం జమానపల్లె పురుషోత్తం రాజు,లోకేష్ రాజు లు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదట పూజ కార్యక్రమం లో జ్యోతి వెలిగించి మైదానం లో కె.పి.ఏల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జెట్ల క్యాప్టన్ లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 13సంవత్సరాలు గా కొనసాగుతున్న క్షత్రియ కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం రెండు సంవత్సరాలు వదలి 11 సంవత్సరాలు గా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని,ఈ ఏడాది 13 టీమ్ లు పోటీలో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లతో కొనసాగి మొదటి, రెండవ, మరియు మూడవ రన్నర్స్ టీమ్ లకు ప్రైజ్ మని తో పాటుగా టూ వీలర్,ల్యాప్ టాప్ మరియు ఎల్ ఈ డి టివి లను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్షత్రియ యువతను చైతన్యం చేయడమే ఈ కే.పీ.ఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని, గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేపీఎల్ మ్యాచ్ లలో చౌడేపల్లి మండలం పుంగనూరు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని, ప్రతి సంక్రాంతి కొత్తదనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని కే పి ఎల్ మ్యాచ్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, కేపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ జట్లు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News