నేటి సాక్షి,మానకొండూరు: మానకొండూరు మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన యువతకు అందించిన సందేశాలు, దేశాభివృద్ధిలో యువత పాత్రపై ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మియాపురం లక్ష్మణాచారి, సోన్నకుల శ్రీనివాస్, కత్తి ప్రభాకర్ గౌడ్, పోచంపల్లి శ్రీనివాస్, భాషబోయిన ప్రదీప్ యాదవ్, మార్కొండ రమేష్ పటేల్,నందగిరి బలరాం, మాదాసు రమేష్, పులిచెర్ల మహేందర్, మాదాసు కుమార్ పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొని స్వామి వివేకానందకు నివాళులర్పించారు.

