నేటి సాక్షి,నల్లబెల్లి జనవరి 12 :గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల క్రీడాజ్యోతితో ఎమ్మార్వో ముప్పు కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.SATTS ఆధ్వర్యంలో 44 రకాల క్రీడలు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగనున్నాయి.ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 8 నుంచి 17వ తేదీ వరకు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. క్రీడల షెడ్యూల్ ఇలా ఉంది: జనవరి 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి 31 వరకు మండల స్థాయి.ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి.ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనున్నాయి.ఈ క్రీడా మహాకుంభంలో చాలా మంది క్రీడాకారులు పాల్గొననున్నారని ఎమ్మార్వో తెలిపారు.క్రీడల ద్వారా గ్రామీణ యువతలో ఆటలాభిలాష పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అంటూ తెలుపుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పుకృష్ణ, ఎంపీఓ రవి, ఎస్సై లక్ష్మారెడ్డి, ఎంఈఓ అనురాధ, ఏపీఎం సుధాకర్,మండల అధికారులు,గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఆశ వర్కర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

